Monday, May 11, 2020

ఖదీర్ బాబు దర్గమిట్ట కథలు_ఒక క్రిస్టల్ క్లీయర్ ఫీలింగ్



       చాల రొజుల తర్వాత, ఏదైన ఒక మంచి పుస్తకం చదవాలని నారాయణగూడలో జరుగుతున్న విశాలాంధ్ర బూక్ ఫేర్ కి అదే పనిగా వెళ్ళాను. పుస్తకాలు వెతకడం మొదలెట్టగానే , నా కళ్ళు 'దర్గామిట్ట కథలు ' పుస్తకాన్ని చూసి మెరిసాయీ . ఎప్పట్నుంచో ఆ పుస్తకం చదవమని మా వాడు ప్రత్యీకంగా చెబుతున్నాడు. ఖరీదు చూశాను. 60 రూపాయలు అని ఉంది. అటు,ఇటు తిరగేసి ఒక పుస్తకాన్ని కొన్నాను, దాంతొ బాటె ఇల్లేరమ్మ కథలు వగైర కూడా కొని అర్జెంట్ గా ఇంటికి వచ్హి కాళ్ళైనా కడుక్కోకుండానే మంచం మీద అడ్డంగా పడి చదవటం మొదలెట్టాను.

    మొదట్లొనే ఈ కథలన్నీ మా నాయనకి అంటునే మనసులోనించి రాయటం మొదలెట్టాడు ఖదీర్ బాబు. మా నాయన మూట కట్టుకున్నది ఆస్తిని కాదు, స్నేహితులని అని అయన రాసిన మాటలు మా నాయన కి కూడ అక్షరాల వర్తిస్తాయి. అందుకే నాకు బాగా మనసుని తాకిందామాట. నాయినలు కేవలం ఆస్తులే కూర్చడం పనిగా పెట్టుకున్న ఈ రోజుల్లోకూడా, మా నాయన సంపాదించిన తరగని అస్తిని ఎంతో అపురూపంగా భావిస్తాను నేను., దీంట్లో ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవితదర్పణం.మనసు పంచుకున్నాడు ఖదీర్ బాబు స్పటిక మంత స్వచమైన భావంతో,భాషతో ఒక్కటేంటి, ప్రతి కథ ఒక స్పటికమే. మెరుస్తూ మనకి కనిపిస్తున్న జీవన చిత్రం.
      ఫుస్తకం అయిపొయినాక దాని ప్రభావం చాల దినాలు నన్ను వదల్లెదు. ఖదీర్ బాబుకి పేరు పెట్టిన మీసాల సుబ్బరాజు అనుకొని ఉందదు,తన పేరు ఇంత గుర్తు పెట్టుకుంటాడని . ఉర్దు చదవలేక తను మిస్సయిన ఉర్దు సాహిత్యన్ని తలుచుకున్న తీరు చాల బాగుంది.       అమ్మతొ బెంచి సినిమా ,మేము మా మేనత్త తో ఎంజాయ్ చెసిన అనుభవాన్నీ గుర్తు చెసింది. దాదాపుగా అయన అనుభవాలన్ని మా జీవిత ఛిత్రాలే. కానీ దాన్ని స్వఛ్హం గా ప్రెజెంట్ చెయగలిగాదు ఖదీర్ బాబు. సంత్రుప్తి గా ఉంది 
      రాగి సంకటి లొ చల్ల పొసుకుని, చింతకాయ తొక్కు నంజుకుని త్రుప్తి గ తిన్నట్లు ఉంది. ఫ్రతి ఒక్కరు కొని చదవల్సిన పుస్తకం. కొన్న వాళ్ళు దాచుకొవలసిన పుస్తకం.
     ఫుస్తకం వనితా  విత్తం... అంటుంటారు గా.. జాగ్రత్తగా దాచుకొండి. నేను చదివి పొందిన అనుభూతి మాటలలొ చెప్పాలంటె మల్ళి ఒక పుస్తకం తయరౌతుంది. కానీ నాకంత శక్తి లేదేమో........

4 comments:

mrityunjay said...

కదీర్ ఉన్నాడు.
తీరిక చేసుకుని కదీర్ "ఖాదర్ లేడు" కూడా చదవగల్రు.

veeraiah said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

ఈ దర్గా మిట్ట కతలు చదివాక కొన్ని రోజులు నాకు మాటలు నెల్లూరు మాండలికం లో వచ్చేవి..అలానే నామిని గారి రచనల తరువాత తిరప్తి బాష...రావి శాస్త్రి గారి రచనలు చదివిన తరవాత ఉత్తరాంధ్ర భాషా మాటల్లోకి వస్తాయి. తెలంగాణ మండలీకం లో తెలిదేవర భానుమూర్తి అనే ఆయన రాసే వారు. నవీన్ రచనల లో అక్కడక్కడా తెలంగాణా మాండలీకం ఉన్నా అది నామ మాత్రమే...

శశి కళ said...

చాలా బాగా వ్రాసారు.వీలు అయితే ఈ బ్లాగ్ చూడండి.
http://khadeerbabumd.blogspot.com